Sunday, 13 September 2026 10:13:22 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

జెఎన్టీయూలో ఈనెల 30,31న ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ గా హైదరాబాద్: 'స్వేచ్ఛ' కిరణ్ చంద్ర

Date : 17 March 2024 08:27 PM Views : 1146

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీద దేశంలోనే అతిపెద్ద సదస్సును మార్చి 30,31వ తేదీల్లో నగరంలోని జెఎన్టీయూలో నిర్వహిస్తున్నట్లు స్వేచ్ఛ వ్యవస్థాపకుడు వై.కిరణ్ చంద్ర తెలిపారు. ఈ సదస్సుతో ఏఐ రంగంలో హైదరాబాద్ దేశానికి సెంటర్ గా మారేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కిరణ్ చంద్ర మాట్లాడుతూ జెఎన్టీయూలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి వస్తున్న దాదాపు 2వేల మంది ఐటీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. వివిధ దేశాల నుంచి విచ్చేస్తున్న 70మంది ఈ సదస్సు కేంద్రంగా ప్రసంగిస్తారని అన్నారు. స్వేచ్చ సంస్థ భాగస్వామ్యంతో ఏఐ4సొసైటీ నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read : అన్ని వర్గాలను కలిపే వారధి హిందుత్వం : కొండా విశ్వేశ్వరరెడ్డి

వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని, సమాజ శ్రేయస్సు కోసం ఏఐని తీర్చిదిద్దే విషయమై గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్, ఆర్కా మీడియా తదితర సంస్థల ప్రతినిధులు చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సును పురస్కరించుకొని తెలుగు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు. రైతులు, వివిధ రంగాల కార్మికులు, పలు విభాగాల్లో పనిచేస్తున్న వారు ఏఐ అద్భుతాలను ఉపయోగించుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏఐలో మాతృభాషలో సొంత స్వరాన్ని ఉపయోగించే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ సదస్సు సందర్భంగా సూపర్ కంప్యూటర్ ప్రాజెక్టును సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని 10 వేల కంప్యూటర్లను సూపర్ కంప్యూటర్ అనుసందానం చేస్తుందన్నారు. సదస్సుకు దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరై ఏఐలో ఉన్న అవకాశాలు, మార్కెట్ పై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేస్తారని అన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: