Wednesday, 29 July 2026 07:17:31 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

గచ్చిబౌలి డివిజన్ లో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

వ్యక్తిగత అభిప్రాయాలకంటే జాతీయభావనే అత్యుత్తమం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 12 August 2024 11:48 PM Views : 1367

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : వ్యక్తిగత, కుల, మత, ప్రాంత అభిప్రాయాలకన్నా ప్రతి ఒక్కరికి జాతీయ భావనే అత్యుత్తమంగా ఉండాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ నుంచి ప్రారంభమైన ర్యాలీ డివిజన్ మొత్తం కొనసాగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  ప్రజలందరు వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగర వెయ్యాలని, ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు.

Also Read : బ్లూమ్ ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీలో సౌండ్ పొల్యూషన్ వివాదం

అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తై 78వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం, మన జెండా నినాదంతో ప్రతి ఇంటిపై మన దేశ గౌరవం మన జెండా ఎగరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించారని అన్నారు, మన దేశంలోని ప్రతి పౌరుడు మన జాతీయ జెండాను మొబైల్ స్టేటస్ లో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి, నేటి యువత, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, హనుమంత్ నాయక్, మీన్ లాల్, వరలక్ష్మి, శివాసింగ్, వినితా సింగ్, గోపాల్, కిషన్ , రంజిత్, సీతా, కవితా భాయి, సంకేశ్, బబ్లూ,నరసింహ, ప్రకాష్ లతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: