Sunday, 13 September 2026 10:14:26 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఓటింగ్ పై పట్టణ ప్రజల మీద ఉన్న అపవాదును తొలగించాలి : కొండా సంగీతారెడ్డి

గచ్చిబౌలి అపర్ణ సైబర్ కమ్యూనిటీలో సంగీతా రెడ్డి ప్రచారం

Date : 14 April 2024 08:12 PM Views : 1068

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : నగరాలు, పట్టణ ప్రజలు ఓటింగ్ మీద శ్రద్ధ చూపించరనే అపవాదును రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు దూరం చేయాలని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య కొండా సంగీతా రెడ్డి అన్నారు. పోలింగ్ డేను హాలిడేగా కాకుండా, మన భవిష్యత్తును మార్చే సందర్భంగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన భర్త, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి అపర్ణ సైబర్ కమ్యూనిటీలో ఆదివారం ప్రచారం నిర్వహించారు.

Also Read : గంజాయి ట్రాన్సుపోర్టు 'వయా' ఔటర్ రింగురోడ్డు

ఈ సందర్భంగా సంగీతా రెడ్డి మాట్లాడుతూ మే 13వ తేదీన ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీని సమర్థిస్తూ బిజెపికి ఓటువేసి గెలిపించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలపై కొండా విశ్వేశ్వరరెడ్డికి పూర్తి అవగాహన ఉందని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విశ్వేశ్వరరెడ్డిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని మరోసారి ప్రధానిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరు బిజెపికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కాక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు, అపర్ణ కమ్యూనిటీ వాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :