Tuesday, 28 July 2026 08:08:27 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

అమెరికా మాస్టర్స్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జగ్జీవన్ రెడ్డికి ఘనస్వాగతం

నగరానికి చేరుకున్న తెలంగాణ అథ్లెట్లకు ఘన స్వాగతం పలికిన నగరవాసులు

Date : 25 July 2024 11:28 PM Views : 1110

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2024లో సత్తాచాటి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న అథ్లెట్ డాక్టర్ జగ్జీవన్ రెడ్డికి నగర వాసులు ఘనస్వాగతం పలికారు. మాస్టర్స్ గేమ్స్ జావెలిన్ త్రోలో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన జగ్జీవన్ రెడ్డి బుధవారం రాత్రి నగరానికి చేరుకోగా, శంషాబాద్ విమానాశ్రయంలో నగరవాసులు ఆయనకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. జగ్జీవన్ రెడ్డితో పాటు మాస్టర్స్ గేమ్స్ లో మహిళల షార్ట్ ఫుట్ లో కంచు పథకం సాధించిన వేసపోగు శ్యామల, స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్ లో గోల్డ్, బ్యాక్ స్ట్రోక్ లో కాంస్య పతకం సాధించిన షేక్ సాజిదా లను ఘనంగా స్వాగతించారు.

Also Read : పట్టినాగులపల్లిలో పేయింటింగ్ కాంట్రాక్టర్ దారుణ హత్య

జూలై 12 నుండి ప్రారంభమైన పాన్ అమెరికన్ అంతర్జాతీయ మాస్టర్ గేమ్స్ లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆర్చరీ, సైక్లింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, సాకర్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించగా, భారతదేశం నుండి 59 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో భారత క్రీడాకారులు మొత్తం 14 పథకాలు సాధించగా, అందులో తెలంగాణ క్రీడాకారులు 4 పథకాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన న్యాయవాది, మాస్టర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ జగ్జీవన్ రెడ్డి పురుషుల విభాగంలో బంగారు పతకాన్ని సాధించగా, మహిళల విభాగంలో సైఫాబాద్‌ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వేసపోగు శ్యామల కాంస్యం, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ స్విమ్మింగ్ కోచ్‌ షేక్ సాజిదా బంగారు, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

కాగా హైదరాబాద్ చేరుకున్న వీరికి రాష్ట్ర క్రీడాకారులు, క్రీడాభిమానులు, సన్నిహితులు, నగరవాసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: