Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : దేశ వ్యాప్త పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగవ దశలో భాగంగా మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కానున్నాయి. ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25వ తేదీ నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కాగా ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను, తెలంగాణలోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికను సైతం మే 13వ తేదీన నిర్వహించి, జూన్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు.
Admin
Ekaburu