Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో ఐదు కార్లు ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. ఎర్రకోట దగ్గరలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు దేశంలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు చేదించగా, ఇదే రోజు ఢిల్లీలో పేలుళ్లు సంభవించడం సంచలనంగా మారింది. ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుండగా.. పేలుళ్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పేలుళ్లు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్నవా లేక ఉగ్రవాద చర్యా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నాయి.
Admin
Ekaburu