Tuesday, 28 July 2026 05:36:55 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

ఘనంగా గ్రాండ్‌క్వీన్స్ లీడర్‌షిప్ అవార్డ్స్-2024

48 మంది మహిళలకు సత్కారం

Date : 13 March 2024 04:29 PM Views : 992

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ యువ, జిల్లా 320ఏ ప్రతిష్టాత్మక 'గ్రాండ్‌క్వీన్స్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2024' వేడుకలను గచ్చిబౌలిలోని క్లబ్ బొటానికాలో ఘనంగా నిర్వహించారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ ఐదవ సీజన్ లో 48 మంది మహిళలను సత్కరించారు. ఈ వేడుకలకు డాక్టర్ మీర్ నవాబ్ నాసిర్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల కన్వీనర్, వ్యవస్థాపకుడు డాక్టర్ సౌరభ్ సురేఖ, సహ వ్యవస్థాపకురాలు రూపా సురేఖ మాట్లాడుతూ గ్రాండ్‌క్వీన్స్ క్లబ్ ఈ కాన్సెప్ట్‌పై ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు తెలిపారు. మహిళా అచీవర్స్, లీడర్స్ తో అద్భుతమైన సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ అవార్డుల కోసం 108 రంగాల నుంచి నామినేషన్లు ఆహ్వానించామని చెప్పారు.

Also Read : అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఈ అవార్డులు 2020లో హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని, నాటి నుంచి భారతదేశం మొత్తం పర్యటిస్తోందన్నారు. చేనేతను ప్రోత్సహించేందుకు డాక్టర్ సౌరభ్ సురేఖా 'చర్ఖా ఫౌండేషన్' భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 మంది గ్రాండ్‌క్వీన్స్ చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్‌ చేశారు. సారీ వాక్‌కు సెలబ్రిటీ ఫ్యాషన్ డైరెక్టర్ శ్రీకాంత్ గతాల కొరియోగ్రాఫ్ చేశారు. 48 అవార్డు గ్రహీతలను 4కేటగిరీలుగా విభజించి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఏ జిల్లా గవర్నర్ లయన్ హరినారాయణ్ భట్టాడ్, లయన్ సీఏ ఎంకే పురోహిత్, డాక్టర్ ప్రీతి రెడ్డి, సురేష్ జగ్నాని, దర్పణ్ వాసుదేవ్, యశ్వంత్ అగర్వాల్, డాక్టర్ ఎస్.రవీందర్, డాక్టర్ ఆశిష్ చౌహాన్, విశేష్ సిన్హా, వందనా షెటే, ఎంఎస్ ఆంచల్ అగర్వాల్, డాక్టర్ జియా హస్మ్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: