Wednesday, 22 April 2026 05:04:44 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

అక్రమ నిర్మాణం... ప్రమాదకరం... పరిసరాలు అంధకారం

నల్లగండ్లలో హై టెన్షన్ వైర్ల మీద పడిన భవనం కర్రలు, పరదా

Date : 01 September 2024 03:02 PM Views : 3238

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ఓ నిర్మాణదారుడి అత్యాశ ఇరుగుపొరుగు వారికి ప్రమాదకరంగా మారగా, మొత్తం పరిసరాలను అంధకారంలో ముంచేస్తుంది. అక్రమ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారుడు తన నిర్మాణం బయటకు కనిపించకుండా కట్టిన పరదా ప్రమాదానికి దారి తీసింది. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనానికి కట్టిన గోవాకర్రలతో కూడిన పరదా విరిగి హై టెన్షన్ వైర్ల మీద పడింది. ఆ సమయంలో భవనం పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు భవన యజమాని అత్యాశ, నిర్లక్ష్యం కారణంగా నల్లగండ్ల ప్రాంతం కొన్ని గంటలపాటు అంధకారంలో ఉండిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

Also Read : ఈర్ల చెరువు బఫర్ జోన్ నిర్మాణదారులపై కేసు నమోదు

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రికి ఎదురుగా ఓ నిర్మాణదారుడు భవన నిర్మాణం చేపట్టాడు. ప్రధాన రహదారికి ఆనుకొని దాదాపు 100 గజాల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. తన అక్రమ నిర్మాణం బయటకు కనిపించకుండా ఆదరాబాదరాగా భవనం ముందు వైపు గోవా కర్రలతో పరదా కట్టి అడ్డం పెట్టాడు. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈదురుగాలులతో గోవా కర్రలు విరిగి భవనం ముందున్న హై టెన్షన్ వైర్ల మీద కర్రలు, పరదా పడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దం, మంటలతో విద్యుత్ సరఫరా స్థానికంగా నిలిచిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటికైనా ఇటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :