Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ గచ్చిబౌలిలో ఆదివారం నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమైన గ్రేస్ క్యాన్సర్ రన్ ఐటి కారిడార్ పరిధిలోని త్రిపుల్ ఐటి జంక్షన్, విప్రో జంక్షన్, టిఎన్ జిఓ కాలనీల మీదుగా తిరిగి గచ్చిబౌలి స్టేడియంకు చేరుకుంది. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్ అనే థీమ్ తో ఏర్పాటు చేసిన 10కిలోమీటర్లు, 5కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల ఈ రన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
Also Read : ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?
గచ్చిబౌలి స్టేడియం వద్ద ఆదివారం తెల్లవారు జామున తెలంగాణ విఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, నగర పోలీస్ కమీషనర్ విసి. సజ్జనార్ లు ముఖ్యఅతిధులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రన్ పూర్తి చేసుకొని విజేతులుగా నిలిచిన వారికి తెలంగాణ ఐటి శాఖమంత్రి డి.శ్రీధర్ బాబు, ట్రాన్స్ పోర్టు మంత్రి పొన్నం ప్రభాకర్, యువజన, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ శివసేనరెడ్డిలు ముఖ్యఅతిధులుగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ రన్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రన్ లో విజేతలుగా నిలిచిన వారిని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్లాస్టిక్ ను మన జీవితం నుంచి దూరం చేసినప్పుడే క్యాన్సర్ ను నివారించవ్చని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిని జయించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు, వలువురు నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Ekaburu