Ekaburu - హైదరాబాద్ / రంగారెడ్డి : వారాంతంలో వినూత్నంగా గడిపారు ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. తమ స్కూల్ పరిసరాల్లో ఉన్న చెరువును శుద్ధి చేసేందుకు నడుం బిగించారు. విద్యార్థుల ఆలోచనకు దృష్టి ఫౌండేషన్ సహకారం తోడవడంతో శనివారం ఖాజాగూడ చెరువులో పారిశుద్య పనులు నిర్వహించారు. శనివారం ఫౌండేషన్ సభ్యులు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కలిసి ఖాజగూడ చెరువు చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు చెత్తను క్లిన్ చేశారు.
చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా చెరువులో చెత్తను పారబోసే వారికి విద్యార్థుల ఈ కార్యక్రమం కనువిప్పు కలిగించింది. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా చెరువు వద్దకు వచ్చి విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యురాలు చారిష్మ ఆకృతి , డైరెక్టర్లు ఏలిజబిత్ జార్జి, మిచెల్ జోష్, పూజిత కొమిరిశెట్టి, సిద్దార్థ్ గుమ్మ, రిషబ్ద్ బోయిడి తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu