Ekaburu - హైదరాబాద్ / : జాబితాలో పేరు లేకపోయినా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మహిళలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరుడు మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను తొలగించి కొత్త ఇళ్ళు నిర్మించి ఇస్తామని గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఇచ్చాడు. కాగా దీన్ని అవకాశంగా తీసుకున్న ఎమ్మెల్యే అనుచరుడు విజయ సింహ మోసానికి తెరలేపాడు. డబల్ బెడ్ రూమ్ ఎంపిక జాబితాలో పేరు లేకున్నా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురు మహిళల వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఇళ్లు రాకపోవడంతో మహిళలు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ మేరకు బాధితులు బోరబండ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. విజయ సింహను అరెస్టు చేసి శిక్షించాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
Admin
Ekaburu