Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఆదివారం మరోసారి చర్యలు ప్రారంభించింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని మల్లంపేట్ లో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ లో చేపడుతున్న విల్లాలను ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.మల్లంపేట్ (కత్వ) చెరువు ఆక్రమించి ఎఫ్ టిఎల్,బఫర్ లలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విల్లాస్ లను గతంలోనే గుర్తించిన హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్ కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపట్టారు.
Also Read : ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు అందజేసిన అటవీ అభివృద్ధి సంస్థ
Admin
Ekaburu