Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన జెనెసిస్ ఫెర్టిలిటీ & లాప్రోస్కోపీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి,చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, హాస్పిటల్ యాజమాన్యం, నిర్వాహకులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండడంలో డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, సేవా దృక్పథంతో పనిచేస్తూ హాస్పిటల్ యాజమాన్యం మంచి పేరును గడించాలన్నారు.
Also Read : నిరుద్యోగులను ముంచిన దొంగ ప్రేమజంట
ఐటీ కారిడార్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఇక్కడి ఐటీ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సేవే మొదటి ప్రాధన్యతగా పనిచేసే హాస్పిటల్ లు, డాక్టర్లు సమాజంలో తగిన గుర్తింపు సంపాదించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు ములగిరి శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, మన్నే రమేష్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, ఉమేష్ లతో పాటు హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Admin
Ekaburu