Saturday, 12 September 2026 09:14:45 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

స్విమ్మింగ్ పూల్ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

కొండాపూర్ మజీద్ బండలో విషాదం

Date : 13 October 2025 10:51 PM Views : 485

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. స్విమ్మింగ్ వూల్ కు సమీపంలోనే బాలుడి కుటుంబం నివాసం ఉంటుండగా, ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నేపాల్ కు చెందిన మహేందర్ రావు, నిర్మల దంపతులు తమ కుమారుడు సూరజ్ రోత్(4)తో కలిసి గతకొన్ని రోజుల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. మజీద్ బండలోని పారామౌంట్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటూ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. కాగా వీరు నివాసం: ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ది క్లబ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఉండగా, అందులో ఓ స్విమ్మింగ్ పూల్ ఉంది.

Also Read : రాయదుర్గంలో ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

ఈనెల 12వ తేదీన మద్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటూ సూరజ్ రోత్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ వూల్ వద్దకు వచ్చాడు. స్విమ్మింగ్ వూల్ గేటు తాళం వేసి ఉండగా, కింద నుంచి లోపలికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ వూల్ నీటిలో పడి మృతి చెందాడు. కొద్దిపేపటికి బాలుడు కనిపించకపోవడంతో స్థానికంగా గాలించిన బాలుడి తల్లి స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చి చూడగా నీళ్లలో నిర్జీవంగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడు స్విమ్మింగ్ పూల్ లో వడిపోతున్న దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: