Tuesday, 28 July 2026 07:16:43 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రాయదుర్గంలో ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

చోరీ చేసిన 14 బైకులు స్వాధీనం

Date : 13 October 2025 07:57 PM Views : 342

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మద్యానికి బానిసగా మారిన వ్యక్తి డబ్బు కోసం ద్విచక్రవాహనాలను దొంగిలించసాగాడు. చోరీ చేసిన వాహనాలను 3 నుంచి 5వేల ధరకు ఇతరులకు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా 14 ద్విచక్రవాహనాలను చోరీ చేసిన నిందితుడిని ఎట్టకేలకు రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి శ్రీధర్ వెళ్లడించారు.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ కు చెందిన కటాయి రాములు(23) జీహెచ్ఎంసీలో చెత్త కార్మికుడిగా పనిచేస్తూ లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివాసం ఉంటున్నాడు. కాగా మద్యానికి బానిసగా మారిన రాములును భార్య వదిలిపెట్టింది. మద్యం తాగేందుకు డబ్బు కోసం రాములు ద్విచక్రవాహనాల దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

Also Read : గచ్చిబౌలిలో ఉత్సాహంగా గ్రేస్ క్యాన్సర్ రన్

ఈ క్రమంలో గత ఏడాదిన్నర కాలంగా రాయదుర్గం పరిధిలో 8, చందానగర్ పరిధిలో 5, ఫిలింనగర్ పరిధిలో ఓ బైకును చోరీ చేశాడు. చోరీ చేసిన వాహనాలను 3 నుంచి 5వేల ధరకు ఇతరులకు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. ఈనెల 12వ తేదీన చందానగర్ లో ఓ బైక్ చోరీ చేసి అదే వాహనం మీద రాయదుర్గం వైపు వస్తుండగా, మైఫిల్ హోటల్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. రాములును అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు విచారించగా మొత్తం 14 బైక్ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో రాములును అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 6.50 లక్షల విలువైన 14 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించారు. సమావేశంలో రాయదుర్గం ఇనిస్పెక్టర్ వెంకన్న, డిఐ భూపతి తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: