Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : ఇప్పటి వరకు అబ్బాయిలు ఇష్టపడిన అమ్మాయిలను కిడ్నాప్ చేయడం చూశాం. కానీ ఇక్కడ ఓ మహిళా వ్యాపారవేత్త తాను ఇష్టపడిన అబ్బాయిని కిడ్నాప్ చేయించి వేదింపులకు గురిచేసింది. పార్ట్ టైం ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న సదరు యువకుడు కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సిటీలో సంచలనం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలో నివాసం ఉండే భోగిరెడ్డి త్రిస్నా అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయడంతో పాటు నాలుగు స్టార్టప్ కంపెనీలకు ఫౌండర్. త్రిస్నా పెళ్లి సంబందాలు వెదుకుతూ భారత్ మ్యాట్రిమోనీలో యాంకర్ ప్రవీణ్ ఐడీని గుర్తించింది. ఫొటో చూసి ట్యాగ్ చేసింది. ఇద్దరూ మంచిగా మాట్లాడుకున్నారు. ఫోన్ లో జరిగిన మాటలతోనే యాంకర్ ప్రవీణ్ అంటే బాగా ఇష్టం పెంచుకుంది. ప్రవీణ్ కు మరింత దగ్గర కావాలనుకున్న త్రిస్నాకు అనుకోని షాక్ తగిలింది. యాంకర్ ప్రవీణ్ ను డైరెక్టుగా కలిసిన త్రిస్నాకు ఆన్ లైన్ ప్రొఫైల్ ఐడీ ప్రవీణ్ ది కాదని తెలిసింది. యాంకర్ ప్రవీణ్ ఫొటోలు, ప్రొఫైల్ తో కొందరు వ్యక్తులు ఫేక్ ఐడి ని క్రియేట్ చేసినట్టు తెలుసుకుంది. ఇదే విషయాన్ని త్రిస్నానే.. ప్రవీణ్ కు చెప్పింది. దీంతో ఫేక్ ఐడీపై అప్పట్లోనే సైబర్ క్రైంకు కంప్లయింట్ చేశాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.
ప్రవీణ్ తో స్నేహన్ని త్రిస్నా ఇష్టంగా మార్చుకోగా, ప్రవీణ్ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. త్రిస్నాను కలవడానికి, మాట్లాడటానికి సైతం ప్రవీణ్ ఇష్టపడే వాడు కాదు ప్రవీణ్. దీంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కోపం పెంచుకున్న త్రిస్నా ప్రతీకారం కోసం పథకం వేసింది. తన పథకంలో భాగంగా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న ప్రవీణ్ ను కిడ్నాప్ చేయించింది. రహస్య ప్రదేశంలో బంధించి, కొట్టించింది. కిడ్నాపర్ల చెరలో ఉన్న ప్రవీణ్ మాటలతో నమ్మించి, వారి చెర నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ప్రవీణ్ పిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Ekaburu