Wednesday, 29 July 2026 08:25:24 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

సింగర్ చిన్మయి మీద గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు

Date : 29 February 2024 09:55 AM Views : 935

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : భారత దేశాన్ని అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద మీద గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు అందింది. సింగర్ చిన్మయి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, యూత్ కెన్ లీడ్ సభ్యుడు ఎం. కుమార్ సాగర్ పిర్యాదు చేశారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ గా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో వీడియో పోస్టు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఈ పోస్టులో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ( చెత్త దేశం) గా, భారత దేశంలో పుట్టడం నా కర్మా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశారు. అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంటే నేరుగా ఖండించవచ్చని, కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని కుమార్ సాగర్ అన్నారు. భారతదేశంలో ఉంటూ, భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ, భారత దేశపు గాలి పీల్చి. భారత దేశం లో పుట్టడమే కర్మ అనడం... భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధని, కోపాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. బాధ్యత గల పౌరుడిగా భారత దేశం పట్ల అగౌరవమైన & అనుచిత వ్యాఖ్యలను కిండిస్తు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో పిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాద పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో సైతం సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: