Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : మాదాపూర్ లో కొన్ని నెలల క్రితమే ఏర్పాటు చేసిన ఓ సాఫ్టువేర్ సంస్థలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. గతంలో కేపీహెచ్బీ లో ఉన్న సదరు సంస్థ కొన్ని నెలల క్రితమే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో కార్యాలయం ప్రారంభించగా, ప్రాజెక్టులు లేని కారణంగా 15 రోజుల క్రితమే తన 80శాతం ఉద్యోగులను ఈ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఏసీలు, పలు లాప్టాప్ లు కాలిపోయాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ భవనం 2వ అంతస్థులో క్యామేల్ క్యూ సాఫ్టువేర్ సంస్థ ఉంది. గతంలో కేపీహెచ్బీ లో ఈ సంస్థ కార్యాలయం ఉండగా, గత 4,5 నెలల క్రితమే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కి మారినట్టు తెలుస్తోంది. కాగా ఈ సంస్థ కు ఎటువంటి ప్రాజెక్టులు లేకపోవడంతో గత 15 రోజుల క్రితమే ఇక్కడ పనిచేస్తున్న 80శాతం మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు స్థానికులు తెలిపారు. కాగా శుక్రవారం రోజుమాదిరిగానే సాయంత్రం కార్యాలయం మూసివేసి నిర్వాహకులు వెళ్లిపోయారు.
శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో క్యామేల్ క్యూ సంస్థ కార్యాలయం నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులు, ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పివేశారు. ఈ అగ్నిప్రమాదం లో క్యామేల్ క్యూ సంస్థలో ఉన్న పలు ఏసీలు, లాప్టాప్ లు కాలిపోయినట్టు తెలుస్తుంది. కాగా ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్టు నిర్వాహకులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అ, లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో కార్యాలయం మూసి ఉండడం, ఉద్యోగులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని, స్వల్ప ఆస్థి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
Admin
Ekaburu