Wednesday, 29 July 2026 07:51:36 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రాయదుర్గంలో యువకుడి దారుణ హత్య

Date : 09 March 2024 04:41 PM Views : 1066

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. నగరంలోని టోలిచోకీలో నివాసం ఉండే విశాల్ సింగ్ గతంలో మణికొండలో నివాసం ఉండే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెద్దలు కల్పించుకొని విశాల్ సింగ్ ను మందలించారు. శుక్రవారం విశాల్ సింగ్ కు ఫోన్ చేసిన యువతి సోదరుడు శ్యామ్ మణికొండకు రమ్మన్నాడు. మణికొండలో విశాల్ సింగ్ తో కలిసి శ్యామ్ అతని స్నేహితులు భయ్యా, అర్జున్, సుమన్, రాజేష్,సోని, అరుణ్ లు మద్యం సేవించారు. మద్యం మత్తులో శ్యామ్ సోదరి విషయం రావడం, విశాల్ సింగ్ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్యామ్ అతని స్నేహితులు విశాల్ సింగ్ మీద కర్రలతో దాడి చేయడంతో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విశాల్ సింగ్ ను పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. విశాల్ ను హత్య చేసిన శ్యామ్, అతని స్నేహితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Also Read : సోమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: