Sunday, 13 September 2026 10:54:07 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

రహదారుల మీద బైక్ రేసింగ్ లకు పాల్పడితే జైలుకే

ఇప్పటి వరకు 89 రేసింగ్ బైక్ లు సీజ్, 9 కేసులు నమోదు : ఏసీపి శ్రీకాంత్

Date : 21 June 2024 07:46 PM Views : 1027

Ekaburu - క్రైమ్ / హైదరాబాద్ : బైక్ రేసింగ్ లకు పాల్పడి రహదారుల మీద భయానక వాతావరణం సృష్టిస్తే జైలు శిక్ష తప్పదని మాదాపూర్ ఏసిపి శ్రీకాంత్ బైకర్లను హెచ్చరించారు. ఐటీ కారిడార్ పరిధిలో అర్థరాత్రి వేళల్లో గతకొంత కాలంగా బైక్ రేసింగ్ లు జరుగుతుండడంతో రాయదుర్గం పోలీసులు దాడులు చేసి ఇప్పటి వరకు 89 బైక్ లను సీజ్ చేయడంతో పాటు 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయదుర్గం ఇన్స్ పెక్టర్ వెంకన్నతో కలిసి ఏసిపి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సువిశాలమైన ఐటి కారిడార్ రహదారుల మీద కొంతమంది యువత ఆర్థరాత్రి వేళల్లో బైక్ రేసింగ్ లు చేపడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు.

Also Read : ఐటీ కారిడార్ లో అర్ధరాత్రి బైక్ రేసింగ్ లు

ఐటి కారిడార్ పరిధిలోని టిహబ్, నాలెడ్జ్ సిటీ, కోహినూర్ బిల్డింగ్ తదితర ప్రాంతాల రహదారులు అర్థరాత్రుల సమయంలో నిర్మాణుష్యంగా, సువిశాలంగా ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు వచ్చి రేసింగ్ లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ రేసింగుల కారణంగా స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడడంతో పాటు ప్రమాదాలు  చోటుచేసుకుంటున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాయదుర్గం పోలీసులు బైక్ రేసింగ్, బైక్ స్టంట్లు నిర్వహిస్తున్న వలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారని తెలిపారు. వారాంతాల్లో కొనసాగతున్న ఈ రేసింగ్ ల మీద గత నెల రోజులుగా పోలీసులు పక్కా నిఘా ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు రేసింగ్లకు పాల్పడుతున్న 89 బైకులు 2 కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. మొత్తం 9 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 89మంది రైడర్ల మీద కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: