Saturday, 18 April 2026 09:00:53 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఆక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను స్పెషల్ టీమ్ అడ్డుకునేనా.. ?

మూడు నెలలైనా ఉలుకూ పలుకు లేని స్పెషల్ టీమ్

Date : 09 October 2025 09:36 PM Views : 317

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / రంగారెడ్డి : ఐటీ కారిడార్ లో క్రషర్ల దుమ్ముతో స్థానికుల అవస్థలు అక్రమ క్రషర్లు, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల ఆగడాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ పేరుకే పరిమితమైంది. ఐటీ కారిడార్ తో పాటు జీఓ 111 పరిధిలో కొనసాగుతున్న అక్రమ క్రషర్లపై చర్యలు తీసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మూడు నెలల క్రితం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో ఈ స్పెషల్ టీమ్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. కానీ నెలలు గడుస్తున్నా స్పెషల్ టీమ్ అక్రమ క్రషర్లు, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ల మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంది. దీంతో ఐటీ కారిడార్ పరిధిలో అక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. వీటి కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గౌలిదొడ్డి పరిధిలోని అక్రమ క్రషర్ల మీద పిర్యాదులు అందుకున్న రంగారెడ్డి జిల్లా పొల్యుషన్ కంట్రోల్ బోర్డు, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను మూసివేయించారు. కాగా ప్రస్తుతం ఉన్న అధికారుల ఉదాసీనత, అండదండలు అసరాగా చేసుకొని ఆక్రమ క్రషర్ల నిర్వాహకులు మరోసారి పాగా వేస్తున్నారు. అసలు అనుమతే లేని చోట.. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ స్థలంలో ప్లాంట్లను ఏర్పాటు చేసి కోట్లు దండుకుంటున్నారు.

Also Read : నగరంలో గంజాయి 'ఘాటీ' లు అరెస్టు

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబరు 37 వివాదాస్పద భూముల్లో ఆక్రమంగా పలు క్రషర్లు, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. గతంలో స్థానికుల పిర్యాదులతో స్పందించిన అధికారులు సదరు క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లను 2023 ఆగస్టులో, 2024 ఫిబ్రవరిలో కూల్చివేశారు. క్రషర్ల కారణంగా వస్తున్న దుమ్ము, పొల్యుషన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఐటి కారిడార్ పరిసరాల్లో క్రషర్ల ఏర్పాటుపై నిషేదం విధించింది. కాగా ప్రస్తుతం ఉన్న అధికారుల అండదండలతో గౌలిదొడ్డి, ఖాజాగూడ తదితర ప్రాంతాల్లో క్రషర్లు, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు మరోసారి తెరుచుకున్నాయి. గౌలిదొడ్డిలోని పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న వివాదస్పద స్థలంలో యదేచ్చగా క్రషర్ల సామ్రాజ్యం ఏర్పాటు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా పనులు నడిపిస్తున్నారు. ఇక్కడి నుంచి నగరంతో పాటు ఔటర్ రింగురోడ్డు వెలువల ఉన్న పలు ప్రాంతాలకు సైతం కాంక్రీట్ సరఫరా జరుగుతుందంటే ఏ స్థాయిలో ప్లాంట్లు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్ల కారణంగా స్థానికంగా దుమ్ము పేరుకుపోవడం, పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ప్రత్యేక టీమ్ ఏర్పాటు.. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఐటీ కారిడార్, జీవో 111 పరిధిలోని అక్రమ క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్లపై చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ మైనింగ్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తూ జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కలెక్టర్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి మూడు నెలలు కావస్తున్నా అక్రమ క్రషర్లను అడ్డుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. క్రషర్లు, మిక్సింగ్ ప్లాంట్ల నిర్వాహకులు అందిస్తున్న నెలవారి మామూళ్లు వదులుకోలేక అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో అటు జీవో 111 పరిధిలో, ఇటు ఐటి కారిడార్ పరిధిలో అక్రమ క్రషర్లు, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు యదేచ్చగా కొనసాగుతున్నాయి. జనాభాసాల మధ్యలో కొనసాగుతున్న ఈ క్రషర్ల కారణంగా స్థానికులు దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :