Wednesday, 22 April 2026 07:14:26 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఈర్ల చెరువు బఫర్ జోన్ లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

కూచివేతలను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్

Date : 11 August 2024 02:50 PM Views : 1278

Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మిస్తున్న నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగా ఏర్పడిన హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మధీనగూడ ఈర్ల చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మదీనగూడ సర్వేనెంబర్ 26లో ఈర్ల చెరువు విస్తరించి ఉంది. కాగా ఈ చెరువు బఫర్ జోన్ పరిధిలో గత కొంతకాలంగా భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఎటువంటి ఎన్వోసీ తీసుకోకుండా స్థానిక  జిహెచ్ఎంసి అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో ఈర్ల చెరువు బఫర్ జోన్ లో యదేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

Also Read : ఒలింపిక్స్ లో హాకీ జట్టు గెలుపుతో పిజెఆర్ స్టేడియంలో సంబురాలు

ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన హైడ్రా చర్యలు చేపట్టింది. ఈర్ల చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి వైశాలి నగర్ లోని ప్లాట్ నెంబర్ 148, 149, 150లలో భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు గుర్తించి, శనివారం కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవి. రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. హైడ్రా ఆధ్వర్యంలో భారీ ఎత్తున సిబ్బంది, అధునాతన వాహనాలతో కూల్చివేతలు చేపట్టగా, పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఈర్ల చెరువు బఫర్ జోన్ పరిధిలో నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. కాగా ఈర్ల చెరువు బఫర్ జోన్ అక్రమణ, నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంపై గతంలోనే ఇరిగేషన్ శాఖ జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ అధికారులకు సమాచారం అందించినా స్పందన లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టడం విశేషం.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :