Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పేటీఎం ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన ఆర్బిఐ మరోసారి పొడిగించే అవకాశం లేదని ప్రకటించడంతో పేటీఎం ఫాస్టాగ్ సేవలు రెండు రోజుల్లో నిలిచిపోయే అవకాశం ఉంది. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు ఎన్‌హెచ్‌ఏఐ బుధవారం కీలక సూచన చేసింది. వినియోగదారులు వెంటనే ఇతర ఫాస్టాగ్ సంస్థలకు మారిపోవాలని కోరింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ కి భారతీయ రిజర్వు బ్యాంక్ ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దానివల్ల ప్రయాణ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపింది. పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో గత నెలలో ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ తొలగించింది.
Also Read : లారీ కిందవడి డెలివరీ బాయ్ మృతి
ఇకపై ఐహెచ్‌ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు తేదీని పొడిగించారు. ఈసారి అలాంటి ఉద్దేశమేదీ లేదని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో పీపీబీఎల్, పేటీఎం వాలెట్, క్యాష్‌బ్యాక్, రిఫండ్, డిపాజిట్, ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ యూజర్లకు సూచించింది.
Admin
Ekaburu