Saturday, 12 September 2026 08:40:38 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ లో 'స్వచ్చదనం - పచ్చదనం' ను ప్రారంభించిన కార్పొరేటర్

Date : 05 August 2024 10:38 PM Views : 1060

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పర్యావరణ పరిరక్షణతోనే మన భావితరాల మనుగడ సాధ్యమని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి వార్డు కార్యాలయంలో జెండాఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మొక్కలు నాటారు.

Also Read : వర్షాకాలంలో నగర వాసులకు మంచినీటి సమస్యలా:  గంగల రాధాకృష్ణ యాదవ్

అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. నగరంలోని ప్రజల జీవన ప్రమాణాలను  మెరుగుపరిచే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని  ప్రకృతి వనం చేసే విధంగా కృషిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సంజయ్, డిఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, సిబ్బంది మురళీ, జావేద్, భరత్, రాందాస్, శ్రీనివాస్, కిష్టయ్య, రాఘు, జవాన్, నాయకులు కిషన్, నర్సింగ్ నాయక్, ప్రసాద్, శ్రీనివాస్, రాజు, నర్సింగ్ రావు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: