Monday, 14 September 2026 12:08:59 AM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కల్వర్టు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

Date : 22 February 2024 06:09 PM Views : 866

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం 4 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాలువ నిర్మాణ పనులను గురువారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షం పడిన ప్రతిసారి స్థానికులు, వాహనదారులు వరద ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాకాలంలో చిన్న వర్షానికే లింగంపల్లి అండర్ బ్రిడ్జి వరద నీటితో మునిగిపోతుందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 4 కోట్ల రూపాయల నిధులతో బాక్స్ కల్వర్ట్ తో పాటు వరద నీటి కాలువ నిర్మాణ పనులను చేపడుతున్నట్టు తెలిపారు.

ఈ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, నాణ్యత లో రాజీ పడకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కల్వర్ట్ నిర్మాణ పనులపై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులో కి వస్తే దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్య నుంచి స్వాంతన లభిస్తుందని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లు, రహదారుల విస్తరణ చేపడుతూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్,మోహన్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, దొడ్ల రామ కృష్ణ గౌడ్, గడ్డం రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: