Tuesday, 28 July 2026 07:20:26 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

పాఠశాల విద్యార్థులతో కలిసి వనమహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్

Date : 10 August 2024 06:52 AM Views : 1494

Ekaburu - శేరిలింగంపల్లి / హైదరాబాద్ : నేటితరం విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం చివరి రోజున గచ్చిబౌలి డివిజన్ పరిధిలో జిహెచ్ఎంసి అధికారులు, స్థానికులు, పాఠశాల విద్యార్థులతో కలిసి వన మహోత్సవం నిర్వహించారు. రాయదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవంలో స్కూల్ విద్యార్థులతో కలిసి గంగాధర్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం గోపనపల్లి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వనమహోత్సవంలో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారే పర్యావరణాన్ని కాపాడతారన్నారు. మన భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పచ్చదనంతో నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సంజయ్, రాయదుర్గం విద్యా కమిటీ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగ మల్లేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు, యూబీడి డిప్యూటీ డైరెక్టర్ అనిల్, మేనేజర్ విక్రమ్ చంద్రతో పాటు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: