Tuesday, 28 July 2026 07:22:44 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

గచ్చిబౌలి డివిజన్ లో బీఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ

చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం : మాజీ కార్పొరేటర్ సాయిబాబా

Date : 11 May 2024 11:00 PM Views : 1135

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం చివరి రోజు శనివారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డివిజన్ మొత్తం ర్యాలీ నిర్వహించారు. ఖాజాగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాయదుర్గం, టెలీకామ్ నగర్, గచ్చిబౌలి, జిపిఆర్ఏ క్వార్టర్స్, గుల్మోహర్ పార్క్, నల్లగండ్ల, గోపన్ పల్లి, ఎన్టీఆర్ నగర్, గౌలిదొడ్డి, నానక్ రాంగూడ మీదుగా సాగింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం ఖాయమన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, తమ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు భారీ మెజారిటీని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలన మీద రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలను అందిస్తే మరోసారి కెసిఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నంరాజు, దారుకుపల్లి నరేష్ శంకరి రాజు ముదిరాజ్ రమేష్ గౌడ్ లతోపాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: