Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు అటు రాష్ట్రస్థాయిలోనే కాదు.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం బయటపడుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటల కారణంగా నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన పదవికి రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ గౌడ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావుకు పంపించారు. నియోజకవర్గం లోని కొంతమంది సభ్యులు తనమీద కొంతకాలంగా నకిలీ ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను అనని మాటలను ప్రచారం చేస్తున్నారని, దీని కారణంగా తన వ్యక్తిత్వం దెబ్బతింటుందన్నారు.
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీ జ్యోతి పామన సైతం ఈ ప్రచారాన్ని నమ్మి తనకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, నకిలీ ఆధారాలను సేకరిస్తున్నారని వాపోయారు. ఇటువంటి వ్యక్తిగత దాడి చేస్తున్న పరిస్థితుల్లో తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఈ పరిస్థితుల్లో నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, మహిళా కాంగ్రెస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Ekaburu