Tuesday, 28 July 2026 05:37:41 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

సర్దార్ సర్వాయి పాపన్న జీవితం స్ఫూర్తిదాయకం :  ఎమ్మెల్యే గాంధీ

మియాపూర్ లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Date : 18 August 2024 10:57 PM Views : 1299

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానమని,  మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి ,బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని, శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి  రాజకీయ , సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండ ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.

Also Read : గచ్చిబౌలిలో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ ముఠా

సమాన్యులనే సైనికులుగా మార్చి గోల్కొండ కోటనే జయించిన సర్వాయి పాపన్న జీవితం అందరికి ఆదర్శమని, భారత దేశాన్ని పాలించే మొఘల్ చక్రవర్తులు పాపన్న పై దాడి చేస్తే సమాన్యుల్లో స్ఫూర్తిని నింపి మొఘల్ సైన్యాన్ని ఓడించిన ధీరుడని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ  సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్, గౌరవ  సలహాదారులు  వి.జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి పుట్ట వినయ్ కుమార్ గౌడ్ ,  స్టీరింగ్ కమిటీ సభ్యులు మోహన్ గౌడ్ అశోక్ గౌడ్ యూత్ కమిటీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు కరుణాకర్ గౌడ్ ఓం ప్రకాష్ గౌడ్ నాగేశ్వర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ అనిల్ కుమార్ గౌడ్ ,మురళితో పాటు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,ఏకాంత్ గౌడ్, చింత కింది రవీందర్, నందు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: