Sunday, 01 March 2026 11:29:13 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం: మాజీ కార్పొరేటర్ సాయిబాబా

కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో రాయదుర్గంలో జోరుగా బీఆర్ఎస్ శ్రేణుల ప్రచారం

Date : 27 April 2024 12:59 AM Views : 3052

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొదట స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన సాయిబాబా అనంతరం రాయదుర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Also Read : శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అక్రమాలు

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీ తో విజయం సాధించడం ఖాయమని అన్నారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, ఎన్నికల్లో తమ అభ్యర్థి కి భారీ ఆధిక్యాన్ని అందజేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు చెన్నం రాజు, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ మెంబర్లు రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, జగదీశ్ లతో పాటు బూత్ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :