Wednesday, 29 July 2026 07:19:54 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

జాగృతి కాలనీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

Date : 03 March 2024 06:27 PM Views : 743

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ జాగృతి కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. కాలనీ అసోసియేషన్, కాలనీ వాసుల ఆధ్వర్యంలో 30లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జాగృతి కాలనీ వాసులు స్వంత నిధులతో 30 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటి హాల్ ను ప్రాంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.

Also Read : రాడిసన్ హోటల్ పై చర్యలకు సిద్ధమైన పోలీసులు

కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన జాగృతి కాలనీ వాసులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాల్ ను కాలనీ వాసుల సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. జాగృతి కాలనీ అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి, శ్రీనివాస్, జాగృతి కాలనీ వాసులు రామకృష్ణ, వాసు, చంద్రశేఖర్, రతన్, శ్రీనివాస్, అమర్, తేజలతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: