Tuesday, 28 July 2026 04:46:40 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

తుది శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ : మాజీ కార్పొరేటర్ సాయిబాబా

గచ్చిబౌలి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

Date : 07 August 2024 08:31 AM Views : 3720

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : తన తుది శ్వాస వరకు తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్  కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ 90వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి సాయిబాబా నివాళులర్పించారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎలుగెత్తి చాటిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ యువతులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకులు  మిద్దెల మల్లారెడ్డి, రాగం జంగయ్య యాదవ్, బాబు మియా, తిరుమల్లేష్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ, నారాయణ, రమేష్ గౌడ్, భిక్షపతి, శ్రీనివాస్, అనిల్ సింగ్, నరేష్ సింగ్, మధు, నర్సింగ్ రావు, నవాజ్, సాయి, అజీమ్, గౌస్, ఖాదర్, బాలామని, సుగుణ , మాధవి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాయదుర్గం నాగాహిల్స్ ప్లాట్లపై మరోసారి వివాదం

ప్రజా గాయకుడు గద్దర్ కు ఘన నివాళి... ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ మొదటి వర్ధంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గద్దర్ పాత్ర ఎంతో కీలకమని, ఆయన తన గేయాలతో తెలంగాణ  యువతలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: