Friday, 11 September 2026 07:13:05 PM
# చిన్నోడిని కవ్విస్తే... బ్యాటింగ్ లో విధ్వంసమే... # యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను

మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం : మాజీ కార్పొరేటర్ సాయిబాబా

ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న కొమిరిశెట్టి సాయిబాబా

Date : 31 March 2024 08:42 PM Views : 1063

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : హైదరాబాద్ నగరంలో నిర్వహించే రంజాన్ వేడుకలు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలిలో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందులో ఆదివారం సాయిబాబా పాల్గొన్నారు. గచ్చిబౌలిలో సయ్యద్ పాషా & సన్స్ (లడ్డు భాయ్ ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం అభినందించదగ్గ విషయం అని, తెలంగాణకు ప్రత్యేకమైన "గంగా జమునా తెహజీబ్" మరింతగా పరిఢవిల్లాలని అన్నారు.

Also Read : హోప్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం : స్పెషల్ మేజిస్ట్రేట్ అశోక్ నేత

రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సాయిబాబా అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసంతో మంచి తనం, సంస్కారం అలవడుతుందని, హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మానిఫెస్టోలో లేని అంశాలను సైతం ప్రవేశపెట్టి,  ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాషా భాయ్, తాహెర్, నవాజ్ లతో పాటు ముస్లిం మత పెద్దలు, స్థానిక ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: